తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. అలాగే హీరో రవితేజ అంటే కూడా అందరికీ సుపరిచితమే.. ఇక సినీ ఇండస్ట్రీలో వీరిద్దరికి ఎంత విభిన్నమైన క్రేజ్ ఉందో చెప్పవచ్చు. అయితే నిన్నటి రోజున రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో  డైరెక్టర్ బాబి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డైరెక్టర్ బాబి రచయితగా బలుపు, డాన్ శీను వంటి సినిమాలకు రైటర్ గా పని చేశారు. ఇక దీంతో వీరిద్దరి మధ్య సన్నిహితం బాగా పెరిగిపోయింది. ఆ సన్నిహిత్యంతోనే తాజాగా రామారావు ఆన్ డ్యూటీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు బాబి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ బాబి మాట్లాడుతూ రవితేజతో సినిమా చేశారంటే ఏ డైరెక్టర్ కైనా సరే లైఫ్ సెటిల్ అయినట్లే అని తెలియజేశారు. రవితేజ తో సినిమా చేసినవారిలో నేను కూడా ఒకరు. బలుపు సినిమా ముందు వరకు నా కెరియర్ వేరే లాగా ఉండేది. ఆ తర్వాత డైరెక్టర్ గా నాకు రవితేజ అవకాశం ఇచ్చారని తెలియజేశారు. ఇక అప్పటినుంచి తన కెరియర్ మారిపోయింది బాబి తెలిపారు.

ఇక రవితేజ నాకు పవర్ సినిమాకి ఛాన్స్ ఇవ్వడం వల్లే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ విషయాన్ని నా ఫ్యామిలీ కంటే ముందుగా నేను రవితేజకే చెప్పాను. మరింత ముందుకు వెళ్తావని చెప్పాడు .ఇక ఆ తర్వాత తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. కానీ నాతో సినిమా చేయడానికి రవితేజ చాలా ఉత్సాహాన్ని చూపించాడు. ఇక అదే ఆయన యొక్క ప్రత్యేకత.. సెట్ చేయడమే కాదు రీసెట్ చేయడం కూడా ఆయనకు బాగా తెలుసు అంటూ రవితేజ పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక రవితేజ తో ఒక సినిమా ప్రాజెక్టుకు సంబంధించి నేను సెట్ చేసుకుంటూ ఉండగా అదే సమయంలోనే ntr జై లవకుశ సినిమా ఛాన్స్ వచ్చింది. ఇక నేను ఆ సినిమా చేయాలంటే నాకు రవితేజ పర్మిషన్ కావాలి.. ఇక ఇబ్బంది పడుతూనే నేను ఆ విషయం ఆయనకి చెప్పగా వెంటనే ఒప్పేసుకోవడమే కాకుండా మీ కెరియర్ మరింత స్పీడ్ అందుకుంటుంది.. అలా ఆయన ఒప్పుకోవడం వల్లే జై లవకుశ సినిమాను తెరకెక్కించాను. ఆయన గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందంటూ బాబి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: