టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది రాశీకన్నా. గత కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయిక లకు బాగానే లోటుంది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తప్పకుండా ఆ స్థాయికి ఎదుగుతుందని ప్రతి ఒక్కరూ భావించారు కానీ వరుస సినిమా అవకాశాలైతే వస్తున్నాయి కానీ ఈమెకు మంచి సక్సెస్ రావటం లేదు. సక్సెస్ రాకపోవడమే ఈమె మరింత వెనుక పడడానికి కారణం అవుతుంది. వాస్తవానికి సక్సెస్ చుట్టే సినిమా జనాలు తిరుగుతూ ఉంటారు. అంతేకానీ ఫైలుర్స్ వస్తే తపకుండా ఎవరు ఎవరిని పట్టించుకోరు. 

అంతకుముందు ఆమె మంచి విజయాలతో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది కానీ ఇప్పుడు ఈమెకు ఏమాత్రం హిట్స్ దక్కటం లేదు. హిట్స్ రాకపోవడంతోనే ఆమెకు వచ్చిన క్రేజ్ తగ్గిపోతుంది అని చెప్పవచ్చు. తాజాగా ఆమె నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో పరాజయం అయ్యాయి. ఆ విధంగా ఆ రెండు సినిమాల యొక్క ఫ్లాప్ లు అవడం తో ఈమె కెరియర్ ఇప్పుడు మరిన్ని కష్టాలలోకి వెళ్లిందని చెప్పవచ్చు. 

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఈ శుక్రవారం విడుదల కాగా ఆ చిత్రం బాక్స్ ఫీస్ వద్ద భారీగా నిరాశ పరచడంతో ఇప్పుడు ఆమెకు మరొక ఫ్లాప్ వచ్చినట్లు అయింది త్వరలోనే ఈమె నటించబోయే సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ చిత్రాలైన ఆమెకు మంచి విజయాలను తెచ్చి పెడతాయి అనేది చూడాలి. ఊహలు గుసగుసలాడే చిత్రంతో ఈ ముద్దుగుమ టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పరిచయమైంది. అక్కడినుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. మంచి అందం అభినయం కలిగి ఉండదడంతో ఆమెను హీరోయిన్ గా పెట్టుకునేందుకు అందరు ఎదురుచూశారు. అలాంటిది ఇప్పుడ వరుస ఫ్లాప్ లు రావడం నిజంగా అందరిని నిరశాపరిచే విషయమనే చెప్పాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: