తద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కన్నడ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తమిళంలో కూడా పలు ధారావాహిక లో నటించింది. ఇక ఈ టీవీ లో నా పేరు మీనాక్షి అనే సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక స్టార్ మా లో ఆమె కథ సీరియల్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇటీవలే నవ్య స్వామి చేసిన కామెంట్స్ అభిమానులందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
ఇటీవల విడుదలైన ఢీ షో ప్రోమో లో భాగంగా సంక్రాంతి రోజు గాలిపటం ఎందుకు ఎగరవేస్తారు అంటూ అడుగుతాడు యాంకర్ ప్రదీప్. అయితే ప్రదీప్ ప్రశ్నకు సమాధానం చెప్పిన నవ్య స్వామి.. వెదర్ కొంచెం కోపరేట్ చేస్తుంది కాబట్టి ఇక కైట్ ఎగరవేస్తారు అంటూ సమాధానం చెబుతుంది. ఈ సమాధానం విని అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు. దౌర్భాగ్యం కాకపోతే సంక్రాంతికి గాలిపటం ఎందుకు ఎగరేస్తారో కూడా తెలియదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది ఇక ఇలాంటివి సర్వ సాధారణం అంటూ లైట్ తీసుకుంటూ ఉండటం గమనార్హం.