పవన్
కళ్యాణ్ హీరోగా ఓ
తమిళ చిత్రం యొక్క తెలుగు రీమేక్ ఇప్పుడు రూపొందుతున్న విషయం తెలిసిందే.
సముద్రఖని దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రానికి
త్రివిక్రమ్ రచయితగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం.
సాయి ధరమ్ తేజ్ కూడా ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నారని అంటున్నారు. ఒక మంచి కథ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ నటించడం అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.
ఇదే సమయంలో పవన్
కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న రెండు భారీ చిత్రాలను పక్కనపెట్టి ఈ
సినిమా చేయడం వెనుక వారు కొంత నిరాశ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తక్కువ సమయంలో పూర్తిచేసి ఆ చిత్రాలను మొదలుపెట్టాలని పవన్
కళ్యాణ్ ఆలోచనగా చెబుతున్నారు. ఏదేమైనా ఆ ఇద్దరు దర్శకులకు మాత్రం పవన్
కళ్యాణ్ నిద్రలేని రాతలను మిగులుస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఈ
సినిమా కోసం పలు టైటిల్స్ పరిశీలించిన చిత్ర బంధం చివరగా జగత్ జజ్జరికా అనే టైటిల్ను పెట్టబోతున్నారని వార్తలను వినిపిస్తున్నాయి.
ఇటీవలే నందమూరి
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబి సార సినిమాలో ఈ డైలాగ్ మనకు వినిపిస్తుంది. ఇంకా విడుదల కానీ ఈ
సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. ఆ విధంగా ఈ రకమైన కాచిపదాన్ని టైటిల్ గా పెడితే తమ సినిమాకు బాగా ఉపయోగపడుతుందని భావించి
సముద్ర ఖని ఈ టైటిల్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
త్రివిక్రమ్ కూడా త్వరలోనే ఈ విషయాన్ని పవన్
కళ్యాణ్ కు చెప్పి ఒప్పించబోతున్నారట. మరి వినడానికి ఎంతో వెరైటీగా క్యాచీ గా అనిపిస్తున్నాయి. మరి ఈ
సినిమా కోసం ఈ టైటిల్ తీసుకు వస్తారా అనేది చూడాలి. త్వరలోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ చిత్రంలో
హీరోయిన్ గా సంయుక్త నటించబోతుంది.