మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకి రీమేక్ కాగా ఈ చిత్రాన్ని తెలుగు నేటి వీటికి తగ్గట్లుగా ఎంతో అందంగా చిత్రీకరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నయనతార అలాగే సత్యదేవ్ నటిస్తున్న కీలకపాత్రలు ఈ చిత్రంలో హైలెట్ కానున్నాయని తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ముఖ్య అతిథిగా నటిస్తూ ఉండడం విశేషం. దీంతో వీరి కాంబో లో రాబోతున్న సినిమా ఎంతో స్పెషల్ గా మారింది. ఈ సినిమా లో చిరంజీవితో కలిసి ఓ పాటలో కూడా ఆయన కనిపించబోతున్నారని అంటున్నారు. కలిసి అదిరిపోయే స్టెప్పులు కూడా వేయబోతున్నారట. అలా ఈ ఇద్దరిని వెండితెరపై ఒకే ఫ్రేమ్ లో చూస్తే తరించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

ఇటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ఎన్నో అంచనాలు కలిగి ఉన్నాయి. తెలుగులో ఇప్పటివరకు ఏ సినిమా చేయని సల్మాన్ ఖాన్ ఈ మెగా చిత్రాన్ని ఒప్పుకోవడం విశేషం. ఆ విధంగా చిత్రంపై ఎన్నో అంచనాలు కూడా కలిగి ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి చేస్తున్న ఓ పాట నుంచి ఫోటో బయటకు వచ్చింది. ఇందులో వీరిద్దరూ కలిసి ఆడి పాడబోతున్నట్లు తెలుస్తుంది. దీని బట్టి ఈ సినిమా యొక్క రేంజ్ మరొక స్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు. తప్పకుండా సల్మాన్ ఖాన్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అవుతాడని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాను దసరా పండుగ విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: