సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .  1 ఆగస్ట్ 1987 వ తేదీన తాప్సి ఢిల్లీలో జన్మించింది. ఈ రోజు తాప్సి పుట్టిన రోజు .  ఈ రోజు తో తాప్సి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది .  తాప్సి అసలు పేరు 'తపసి' కాకపోతే అనేక మంది అనేక రకాలుగా పిలుస్తూ ఉండడంతో ఆమె పేరును తాప్సి గా మార్చుతుంది .

తాప్సీ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసింది . అలాగే మెడల్ గా కూడా తాప్సి పనిచేసింది .  ఈ ముద్దు గుమ్మ దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వం లో  మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ఝుమ్మంది నాదం మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది . మొదటి తెలుగు మూవీ తోనే ఈ ముద్దు గుమ్మ తన నటనతో, అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది . అలా ఝుమ్మంది నాదం సినిమాతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత అనేక తెలుగు సినిమా లలో నటించి మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది .

ప్రస్తుతం తాప్సీ బాలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది . అలాగే వీలుచిక్కినప్పుడల్లా తెలుగు లో కూడా నటిస్తూ వస్తుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తాప్సి బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ ని ఫుల్ జోష్ లో కొనసాగిస్తోంది .  తాప్సీ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాప్సి పర్సనల్ విషయాలకు వస్తే బంగాళదుంప కర్రీ అంటే చాలా ఇష్టమట.

మరింత సమాచారం తెలుసుకోండి: