ఎప్పటి నుంచో ఏదైనా సినిమా ఘనవిజయం సాధిస్తే అది హీరో క్రెడిట్ అవుతుంది లేదంటే అది దర్శకుడికి చెల్లుతుంది. అభిమానులు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా సినిమా యొక్క ఫ్లాప్ నిందను దర్శకుడుగా మోపిస్తుంటారు. హిట్  వస్తే అది కేవలం హీరో వల్లే అంతటి పెద్ద విజయం సాధించింది అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులకు ఎన్నో రోజుల నుంచి ఈ అన్యాయం జరుగుతుందని చెప్పవచ్చు. ఇటీవలే ఇద్దరు దర్శకుల విషయంలో ఇది మరోసారి తేటతెల్లం అయ్యింది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వగా దానికి పూర్తి బాధ్యత కొరటాల శివ వహించాడు. వాస్తవానికి ఆ సినిమా హిట్ అయితే తప్పకుండ మెగాస్టార్ చిరంజీవి దానికి కారణం అని మెగా అభిమానులు చెప్పుకునే వారు.రామ్ చరణ్ మిగితా క్రెడిట్ తీసుకునే వారు. కానీ ఫ్లాప్ అయ్యే సరికి పూర్తి ఫ్లాప్ క్రెడిట్ అంతా దర్శకుడి మీదకి వెళ్ళింది. దాంతో ఒక్కసారిగా ఆయనపై ఎంతో ఒత్తిడి భారం పెరిగిందని చెప్పొచ్చు. కారణం ఏదైనా ప్రతి సారి ఉన్న ఆనవాయితీ ఇప్పుడు కూడా కొనసాగింది.

అంటే సుందరానికి సినిమా విషయంలోనూ ఇదే విధమైన ధోరణి కనిపించింది. సినిమా మొదట్లో బాగుంది అన్నవాళ్లు కాస్త ఇప్పుడు దర్శకుడి వల్లే సినిమా పోయింది అని చెప్తున్నారు. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా యొక్క ఫ్లాప్ తాలుకు ప్రభావం హీరో పై కాకుండా దర్శకుదిపైనే పడింది. ఓ వైపు దియేటర్ లకు ప్రేక్షకులు రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న మేకర్స్ కు ఇప్పుడు ఈ రకమైన వత్తిడి కూడా రోజు రోజు కి బాగా పెరిగిపోతుంది. అభిమానులు ఇప్పటికైనా తమ హీరోల పట్ల ఉన్న పిచ్చి అభిమానాన్ని పక్కన పెట్టి దర్శకుల పట్ల వేలు పెట్టొద్దని తమ తమ హీరోల కి చెప్తే మంచి అవుట్ పుట్ సినిమా కి వస్తుంది అని చెప్పొచ్చు. మరి రాబోయే కాలంలో ఈ రకమైన సంస్కృతి మారుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: