బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న జాన్వీ కపూర్ కి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం వచ్చింది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే .

తాజాగా ఈ వార్తలపై జాన్వీ కపూర్ స్పందిస్తూ ... తనకు తెలుగు లో లేదా మరియు ఇతర సౌత్ మూవీ లలో చేయాలనే కోరిక చాలా ఉందని జాన్వీ కపూర్ చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే చాన్స్ వచ్చిందనే రూమర్ నిజమైతే తనంత లక్కీ ఫెలో ఎవరూ ఉండరని , కాక పోతే తనకు దురదృష్టవశాత్తు  అలాంటి అవకాశం రాలేదని తాజాగా జాన్వీ కపూర్ తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ తో నటించే చాన్స్ రావడమంటే మామూలు విషయం కాదని కూడా జాన్వీ కపూర్ చెప్పింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని జాన్వీ కపూర్ తెలిపింది.

ఇది ఇలా ఉంటే జాన్వీ కపూర్ తాజాగా గుడ్ లక్ జెర్రీ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ జూలై 29 వ తేదీ న నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయ్యింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.  ఈ మూవీ తమిళం లో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన కొలమను కోకిల మూవీ కి అధికారిక రిమేక్.

మరింత సమాచారం తెలుసుకోండి: