నటుడిగా , నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన క్యాథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించగా , ఈ మూవీ కి మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా హైలెట్ గా ఉండటంతో ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 5 వ తేదీన విడుదల అయిన బింబిసార మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలా బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు మూడు రోజుల బాక్సా పీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న బింబిసార మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.
 
నైజాం : 5.72 కోట్లు ,
సీడెడ్ : 3.40 కోట్లు ,
యూ ఏ : 2.29 కోట్లు ,
ఈస్ట్ : 1.03 కోట్లు ,
వెస్ట్ : 74 లక్షలు ,
గుంటూర్ : 1.27 కోట్లు ,
కృష్ణ : 89 లక్షలు ,
నెల్లూర్ : 50 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులకు గానీ బింబిసార మూవీ 15.84 కోట్ల షేర్ , 24.50 కోట్ల గ్లాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.10 కోట్లు .
ఓవర్ సీస్ లో : 1.35 కోట్లు .
మూడు రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా బింబిసార మూవీ 18.29 కోట్ల షేర్ , 30.00 కోట్ల క్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: