బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో తనదైన గుర్తింపు ఏర్పరచుకున్న ఆలియా భట్ కొంత కాలం క్రితం విడుదల అయిన తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ మూవీ లో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఆలియా భట్ పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. అలాగే ఈ మధ్యనే ఆలియా భట్ గంగు భాయ్ కతీయవాడి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా వరుస మూవీ లతో ఆలియా భట్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఆలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం మనకు  తెలిసిందే. ప్రస్తుతం ఆలియా భట్ ప్రెగ్నెన్సీ తో ఉన్న కారణంగా సినిమా షూటింగ్ లకు దూరంగా ఉంటుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆలియా భట్ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఆలియా భట్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ లేదా పోస్ట్ పెట్టడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్లు ,  ఆలియా భట్ తన ఇన్ స్టా లో ఒక్క పోస్ట్ కి దాదాపు  ₹80 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ఆలియా భట్ సినిమాలతో పాటు , సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా బాగానే డబ్బులు సంపాదిస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: