విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుపుకుంటున్నాయి. దేశంలోనీ పలు ప్రాంతాలలో ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ నిర్వహిస్తున్న విజయ్ దేవరకొండ తప్పకుండా ఆగస్టు 25వ తేదీన విధ్వంసం సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు ఆయన అభిమానులు.  ప్రమోషన్ కార్యక్రమాలలో అగ్రెసివ్ గా ఉంటూ తన సినిమా యొక్క ప్రమోషన్ ను ఎంతో బాగా చేసే విజయ్ దేవరకొండసినిమా కోసం కూడా అదే స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నాడు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన రావడానికి సిద్ధం అవుతుండగా ఐదు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తూ ఉండడం విశేషం. తెలుగు హిందీ భాషలతో పాటు కన్నడ మలయాళ తమిళ భాషలలో సైతం ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇది ఆయన యొక్క క్రేజ్ కు నిదర్శనం గా చెప్పాలి. ఇప్పటివరకు హిందీ లో ఒక్క సినిమా విడుదల చేయకముందే ఆయనకు ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కడం నిజంగా విశేషం అనే చెప్పాలి.

పలు డబ్బింగ్ సినిమాల ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. కేవలం దాని ద్వారానే ఇంతటి క్రేజీ సంపాదించుకొని ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేస్తూ ఉండడం విశేషం. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు ఈ సినిమా కోసం పనిచేయడం అదనపు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా త్వరలోనే ఈ సినిమా యొక్క సౌత్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టబోతుంది చిత్ర బృందం. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి విధంస కరమైన కలెక్షన్లను చిత్ర బృందం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత పలు ఇంటరెస్టింగ్ సినిమాలతో బిజీ కాబోతున్నాడు విజయ్ దేవరకొండ. 

మరింత సమాచారం తెలుసుకోండి: