ఎంతగానో ఊరించి ప్రేక్షకుల ముందుకొచ్చిన లాల్ సింగ్ చడ్డా చిత్రం బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడి బోల్తా కొట్టింది. అసలు ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు.ఒకప్పుడు తన సినిమా వసూళ్లతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ నే ఊచకొత కూయించిన బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్, ఇంకా హాట్ నటి కరీనా,అలాగే తెలుగు హీరో నాగచైతన్య వంటి ఎందరో స్టార్స్ నటించిన ఈ మూవీ మీద ఎన్నో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అయితే ఎందుకో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయి చతికల పడిపోయింది. అసలు ఈ సినిమా విడుదలకు ముందే 'బాయికాట్ లాల్ సింగ్ చడ్డా' అనే హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది.ఇక గతంలో ఎప్పుడో అమీర్ ఖాన్ .. ఈ దేశంలో ఉండటం అసహనం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.


ఆ వ్యాఖ్యలకు కాషాయదళం ఈ సినిమా టైంలో బాగా రివెంజ్ తీర్చుకున్నదన్న టాక్ వినిపించింది.అయితే సినిమా బాగుంటే ఇటువంటి ప్రచారాలు అనేవి పెద్దగా నష్టం చేకూర్చేవి కాదేమో.. కానీ మూవీకి నెగటివ్ టాక్ రావడంతో సినిమా బాగా దెబ్బతిన్నది.ఈ సినిమాపై తాజాగా కరీనా కపూర్ కూడా స్పందించారు. ఇక ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'కేవలం ఒక్కశాతం జనం మాత్రమే లాల్ సింగ్ చడ్డా సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు. అందుకే ఓపెనింగ్స్ బాగా తగ్గాయి. నిజానికి ఇది చాలా గొప్ప సినిమా. ఇటువంటి మంచి సినిమాను ప్రేక్షకులు అసలు వదులుకోవద్దు. దయచేసి సినిమాని ఆదరించండి. తప్పుడు అస్సలు ప్రచారం నమ్మకండి. ఈ సినిమా కోసం మేం మూడేళ్లు బాగా కష్టపడ్డాం' అంటూ చెప్పుకొచ్చింది కరీనా.. మరి ఆమె మాటలను ప్రేక్షకులు వింటారా? లేదా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: