తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రొడ్యూసర్లు అంతా కలిసి సినిమా బడ్జెట్ ఎక్కువవుతుంది అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందుకోసం సినిమా షూటింగ్లో కూడా బంద్ చేశారు ఆగస్టు ఒకటి నుంచి సినిమా షూటింగ్లో నిలిపివేశారు నిర్మాతలు. అయితే తాజాగా ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ లో పలు చర్చలు జరిగాయి ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన దిల్ రాజ్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు వాటి గురించి చూద్దాం.


దిల్ రాజు మాట్లాడితూ.. ఓటిటి లో సినిమాల విడుదలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇకనుంచి రిలీజ్ అయిన ప్రతి ఎనిమిది వారాల తర్వాతనే ఓటిటి లో సినిమా రావాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటివరకు అగ్రిమెంట్లు పూర్తయిన వాటిని కూడా పరిశీలిస్తున్నామని ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్న చిత్రాలను థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతనే ఈ సినిమా లు ఓటిటి లో వస్తాయి అని తెలియజేశారు దిల్ రాజు. ఫిలిం ఛాంబర్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మధ్య ఈ అగ్రిమెంట్లు జరిగినట్లు సమాచారం.


ఓటీటి, టికెట్ ధరలు,VPF చార్జీలు నిర్మాణ వ్యయంపై చర్చించనున్నారు.. అలాగే థియేటర్ మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరలను అందులో ఉండే తినుబండారాల ధరలను కూడా ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఇలాంటి వాటిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే సినిమా షూటింగులు మొదలుపెడతామని తెలియజేశారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు వరుస పెట్టి సినిమాలు చేస్తే చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. ఇక అంతే కాకుండా సినిమాలు బాగా ఉంటే ప్రేక్షకులు వస్తారని భావిస్తున్నాను నిర్మాతలు. అందుకు ఉదాహరణలుగా పలు సినిమాలు ఈ మధ్యలో తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: