గ్లామరస్ యాంకర్ మరియు నటి అయి నటు వంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ ప్రస్తుతం అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో నటిస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది . 

అనసూయ ఇప్పటి కే తన కెరీర్ లో ఎన్నో మంచి మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించింది . ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ తో అనసూయ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది . ఈ మూవీ లో అనసూయ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస టీవీ షో లతో , వరుస మూవీ లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది . ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఇండస్ట్రీ లో మహిళలను ఎలా చూస్తారు అనే విషయంపై అనసూయ వివరించింది .

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అనసూయ మాట్లాడుతూ ... ఇండస్ట్రీ లో మహిళలు అంటే మరీ ముఖ్యంగా హీరోయిన్ లకు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ . కెమెరా ముందు వాళ్లు సిగ్గు పడుతూ నవ్వాలి , అది అంత వరకే. వారు అస్సలు మాట్లాడకూడదు. పోకిరి మూవీ లో లాగా గిల్లితే గెలుచుకోవాలి అనే లా ఉంటుంది. వారి హక్కుల కోసం మాట్లాడితే వారిని తొక్కేస్తారు. హీరోయిన్ అంటే డేవాదాసిలా పని చేయాలి అన్నట్లుగా చూస్తారు అని అనసూయ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పు కొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: