ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . త్రిష తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంత మైన సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది .

ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు తమిళ ఇండస్ట్రీ లో కూడా అనేక మూవీ లలో నటించి ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా కొన సాగుతుంది . ప్రస్తుతం త్రిష తమిళ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది . అందులో భాగంగా తాజాగా ఈ ముద్దుగుమ్మ మణిరత్నం దర్శకత్వం లో  తెరకెక్కిన పొండియన్ సెల్వన్ మూవీ లో ఒక ప్రధాన పాత్రలో నటించింది . ఈ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతుంది .

ఇది ఇలా ఉంటే ఇటీవల త్రిష మూవీ లకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ వార్తలపై త్రిష తల్లి ఉమ కృష్ణన్ స్పందించండి. త్రిష రాజకీయాల్లోకి రావడం లేదు అని , ప్రస్తుతం సినిమాల పైనే త్రిష ఫోకస్ పెట్టింది అని ,  పలు భాషల్లో ప్రస్తుతం త్రిష సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతుంది అని త్రిష తల్లి ఉమ కృష్ణన్ తాజాగా వెల్లడించండి. అలాగే త్రిష  కూడా పాలిటిక్స్ లోకి వెళ్లే ఆలోచన లేదు అని వెల్లడించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: