టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే ఈ సంవత్సరం మూడు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుక విడుదల అయిన బంగార్రాజు మూవీ లో నాగచైతన్య నటించాడు.మూవీ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో పెరకెక్కిన థాంక్యూ మూవీ లో నాగ చైతన్య సోలో హీరోగా నటించాడు. 

మూవీ లో రాశి ఖన్నా నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత అమీర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నాగ చైతన్య నటించాడు. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే తమిళ క్రేజీ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక మూవీ లో హీరోగా నటించబోతున్నట్లు ఇది వరకే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో కృతి శెట్టి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఇది వరకే వీరిద్దరూ కలిసి బంగార్రాజు మూవీ లో కలిసి నటించారు.

నాగ చైతన్య ,  కృతి శెట్టి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇళయరాజా , యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతం అందించనున్నారు. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ షూటింగ్ ని రేపటి నుండి ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: