టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన నాగ శౌర్య ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో హీరోగా నటించాడు. అందులో భాగంగా నాగ శౌర్య ,  వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఛలో మూవీ తో టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో నాగ శౌర్య సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఛలో మూవీ తో నాగ శౌర్య క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈ హీరో అనేక మూవీ లలో హీరోగా నటించాడు. అందులో భాగంగా అశ్వద్ధామ మూవీ తో నాగ శౌర్య బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం సాధించాడు. 

ఇది ఇలా ఉంటే నాగ శౌర్య పోయిన సంవత్సరం వరుడు కావలెను అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ నాగ శౌర్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నాగ శౌర్య 'లక్ష్య' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది.

మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా వరుసగా రెండు అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో అయినా నాగశౌర్య మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: