కమలహాసన్ హీరోగా, ఫహాద్ ఫాజిల్ ,విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా జూన్ మూడవ తారీఖున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ఈ ఈ సినిమాని తన బ్యానర్ పైనే నిర్మించారు కమలహాసన్ దీంతో ఈ చిత్రం కొన్ని కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది కమలహాసన్ కు. థియేటర్లో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం బుల్లితెరపై సెప్టెంబర్ 11వ తేదీన స్టార్ మా లో ప్రసారమవ్వడం జరిగింది. అయితే విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అనుకున్నారు.


టిఆర్పి రేటింగ్ విషయంలో రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అందరూ భావించారు.. కానీ బుల్లితెరపై మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఫ్లాప్ గా మిగిలిపోయింది విక్రమ్ సినిమా అని చెప్పవచ్చు. మొదటిసారి టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు ఈ చిత్రం 5.1 టిఆర్పి రేటును మాత్రమే నమోదు చేసుకుంది ఈ సినిమా .డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ రూ.8 కోట్ల రూపాయలకు పైగా కొనుగోలు చేసినట్లు సమాచారం.


అయితే ఈ సినిమా తిరిగి మళ్లీ జి-5 లో కూడా ప్రసారమవుతోంది. విక్రమ్ సినిమా రెండుసార్లు ఓటీటి లలో ప్రసారం కావడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని సమాచారం. అయితే విక్రమ్ సినిమా బుల్లితెరపై టెలికాస్ట్ అయినప్పుడు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక RRR, కే జి ఎఫ్ -3 సినిమాలు బుల్లితెరపై టెలికాస్ట్ అయినప్పుడు మంచి టిఆర్పి రేటింగును నమోదు నమోదు చేసుకోలేకపోయాయి అయితే అందుకు కారణం ఓటీటి లో ప్రసారం అవ్వడం వల్లే ఇలా జరుగుతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే రాబోయే రోజుల్లో బుల్లితెర పై ప్రసారమయ్యే సినిమాల డీల్స్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: