టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎవరంటే ఎక్కువ వినిపించే పేరు దిల్ రాజు.. ఆయన అసలు పేరు వి.వెంకట రమణారెడ్డి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగులో ఎన్నో…విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. తన మొదటి చిత్రం 'దిల్' సక్సెస్ తో ఆయన దిల్ రాజుగా మారిపోయారు. అనతి కాలంలోనే ఆయన స్టార్ స్టేటస్ ని దక్కించుకన్నారు. ఇక దిల్ రాజు ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆయనకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే దిల్ రాజు రెండో భార్య గురించి చాలా మందికి తెలుసు.. కానీ మొదటి భార్య గురించి పెద్దగా తెలియదు..
దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత..అయితే వారిది ప్రేమ వివాహం అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'నేను మా సొంత ఊరిలో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాను. కాలేజీలో బాగా చదువుకొని ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మాది లవ్ మ్యారేజ్. నా కజిన్ పెళ్లిలో మొదటిసారి అనితను చూశాను. నా వద్దకు వచ్చి కెమెరాలో వేసే సెల్స్ ఉన్నాయా అని అడిగింది. అలా మాటలు కలవడంతో ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ప్రపోజ్ చేసుకున్నాము. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాము' అంటూ దిల్ రాజు తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. వారిది 45 రోజుల ప్రేమకథ అని దిల్ రాజు చెప్పారు.
అయితే దిల్ రాజు భార్య అనిత 2017లో అనారోగ్య సమస్యతో మరణించారు. దీంతో ఆయన కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అనిత దిల్ రాజు దంపతులకు హన్షిత రెడ్డి అనే ఒక కూతురు ఉంది. ఆమెకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. తన కూతురి ఒత్తిడి మేరకు పెద్దల సలహాతో కరోనా లాక్ డౌన్ సమయంలో దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వారికి ఓ కుమారుడు కూడా జన్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: