సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే చాలు స్టార్‌ అయిపోవచ్చు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందరి విషయంలో అది జరుగదు.
ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఒక్కటే ఉంటే సరిపోదు. నటన రావడంతో పాటు అదృష్టం కూడా ఉండాలి.
| సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ ఉంటే చాలు స్టార్‌ అయిపోవచ్చు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందరి విషయంలో అది జరుగదు. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఒక్కటే ఉంటే సరిపోదు. నటన రావడంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా తన చుట్టూ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా హీరోగా మాత్రం నిలబడలేకపోతున్నాడు అల్లు శిరీష్‌. తండ్రి స్టార్‌ ప్రొడ్యూసర్‌, అన్న పాన్‌ ఇండియా స్టార్.. అయినా కాని అల్లు శిరీష్‌కు అదృష్టం కలిసి రావడంలేదు. ఇప్పటి వరకు ఈయన ఆరు సినిమాల్లో నటించాడు. ఆ ఆరు సినిమాలు ఒకదానికొకటి సంబంధంలేకుండా విభిన్న జానర్‌లో తెరకెక్కినవే. అయితే ఈ ఆరింట్లో కొత్తజంట, శ్రీరస్తు శభమస్తు చిత్రాలు మాత్రమే హిట్లుగా నిలిచాయి. అల్లు శిరిష్‌ ఎన్ని ప్రయోగాలు చేసిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌ సాధించలేకపోతున్నాడు.

ఈ క్రమంలో అందరికి ఇష్టపడే రోమ్‌-కామ్‌ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి గతంలో ప్రేమ కాదంట టైటిల్‌ను అనుకున్నారు. పోస్టర్‌లను కూడా విడుదల చేశారు. అయితే తాజాగా ఈ సినిమా పేరు మారుస్తూ కోత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఊర్వశివో రాక్షసివో అనే కొత్త టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ ఓ రొమాంటిక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అంతేకాకుండా ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్‌ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని క్రియేట్‌ చేశాయి. రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శిరీష్‌కు జోడీగా అను ఇమాన్యూయేల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: