ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కు వశిష్ట్ అనే కొత్త దర్శకుడు ఇటీవల ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించాడు అన్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తలకెక్కిన బింబిసార సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నిర్మాతలకు ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఒక్కసారిగా దర్శకుడు వశిష్ట్ పేరు మారుమోగిపోయింది.


 అతని టేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. అయితే ఇలా బింబిసారా అలాంటి సోషియో ఫాంటసీ మూవీ ని తెరకెక్కించి మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ కొట్టిన దర్శకుడు వశిష్ట్ కూడా హీరోగా సినిమాల్లో నటించాడు అన్న విషయం మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. మల్లిడి వశిష్ట్ దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడానట.. అయితే ఇతని అసలు పేరు వేణు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ తనయుడు. సాధారణంగా హీరోలు దర్శకులుగా మారడం ఎప్పుడు కామన్ గా జరుగుతూ ఉంటుంది.


 వశిష్ట్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట.. ఒకే ఒక సినిమాలో హీరోగా నటించిన తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తాడు వశిష్ట్. హీరోగా దర్శకుడిగా చేసిన సినిమాకు మధ్య పదహారేళ్ల గ్యాప్ ఉండడం గమనార్హం. 2006లో కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమ లేఖ రాశా అనే సినిమాలో హీరోగా నటించాడు. కులశేఖర్ లాంటి రచయిత దర్శకుడిగా ఒక సినిమాను చేశారంటే ఆ సినిమాపై అంచనాలు ఉండడం సహజం. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం పెద్దగా ప్రేక్షకులు ఆదరణ పొందలేదు. తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న వశిష్ఠ దర్శకుడిగా మారి బింబిసారా సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ  ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: