తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా వున్నాడు..నాలుగు ఐదు సినిమాలను లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..ఆ సినిమాలు అన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి..దసరా కానుకగా అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్‌. మోస్ట్ అవెయిటెడ్ ఆదిపురుష్‌ నుంచి అక్టోబర్ 2న ఫస్ట్‌ లుక్ పోస్టర్‌, టీజర్ రిలీజ్ కానున్నాయి.ఇప్పటికే టీజర్ రిలీజ్ ఈవెంట్ కోసం అయోధ్యకు బయలుదేరారు ప్రభాస్ ఫ్యాన్స్. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉన్న ఈ నుంచి ఇంత వరకు ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవటంతో ఫస్ట్ అప్‌డేట్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
 


మర్యాద పురుషోత్తముడిగా ప్రభాస్ ఎలా ఉంటారు..లేక రాజుగా కిరీటంతో చూపిస్తారా…? లేకపోతే వనవాసంలో ఉన్న లుక్ రివీల్ చేస్తారా..? టీజర్‌లో డైలాగ్ ఉంటుందా..? ఇలా వందల ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ మేరకు టీజర్ పై అంచనాలు పెంచుతున్నాయి..రాముడిగా ప్రభాస్‌ను చూస్తే రెప్ప వేయటం కూడా మర్చిపోతారంటూ ముందు నుంచే ఊరిస్తున్నారు దర్శకుడు ఓం రవుత్‌. అసలు ప్రభాస్ నో అంటే ఆదిపురుష్ ప్రాజెక్ట్ ఉండేది కాదన్నారు. అంతగా డార్లింగ్ రాముడి పాత్రలో ఒదిగిపోయారన్నది ప్రస్తుత టాక్..


 తన కళ్లతో చూసిన రాముడిని ఇప్పుడు ప్రపంచానికి చూపించబోతున్నారు కెప్టెన్. ఇప్పటి వరకు ఫ్యాన్ మేడ్ లుక్స్‌ మాత్రమే వైరల్ అయ్యాయి. ఒక దశలో ఓం కూడా వాటినే షేర్ చేశారు. ఇప్పుడు అసలు లుక్ రివీల్ అయ్యింది. రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు అంటూ టీజర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్ రిలీజ్ అయిన క్షణం నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పోస్టర్ తోనే నయా రికార్డ్ క్రియేట్ చేయాలని డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆల్రెడీ రెడీ అయిపోయారు. భారీ అంచనాలు ఉన్న , అందులోనూ డార్లింగ్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ.. అది కూడా రఘు రాముడి పాత్ర కావటంతో రికార్డ్స్ గ్లోబల్ రేంజ్‌లో ఉంటాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు..మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: