టాలీవుడ్ యంగ్ బ్యూటీ లలో ఒకరు అయిన శ్రీ లీలా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ హీరోయిన్ శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీ లీల మొదటి మూవీ లొనే తన అద్భుతమైన నటన తో ,  అంతకు మించిన అంద చందాలతో ,  డ్యాన్స్ తో ఎంతో మంది  ప్రేక్షకులను కట్టిపడేసింది.

దానితో ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. పెళ్లి సందD మూవీ తర్వాత శ్రీ లీలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరి పోయే మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయిన మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ధమాకా మూవీ ని విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉంటే ధమాకా మూవీ సెట్స్ పై ఉండగా డీజే టిల్లు పార్ట్ 2 మూవీ లో శ్రీ లీల కు అవకాశం వచ్చింది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దానితో ఈ ముద్దు గుమ్మ మరో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్టు వార్తలు  వచ్చాయి. కాకపోతే డీజే టిల్లు 2 మూవీ లో శ్రీ లీల కి అవకాశం వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితమే డీజే టిల్లు పార్ట్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: