ఆది పురుష్  సినిమా ద్వారా ప్రభాస్ ని రాముడి అవతార్ లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహ పడ్డారు.అయితే నిన్న విడుదల చేసిన 'ఆది పురుష్' టీజర్ వారందరినీ నిరుత్సాహపరిచ్చినట్లు తెలుస్తోంది. యాంటీ ఫ్యాన్స్ ఐతే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. డార్లింగ్ అభిమానులకు కూడా ఈ టీజర్ చూసి నోట మాట రాలేదు. పూర్తిగా డిజప్పాయింట్ అయినట్లుగా పోస్టులు పెడుతున్నారు.'ఆది పురుష్' టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని.. వీఎఫ్ఎక్స్ దారుణమని.. సీరియల్ ప్రోమో చూసిన ఫీలింగ్ కలిగిందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇది చిన్న పిల్లల కోసం తీసిన కార్టూన్ సినిమా లేదా యానిమేషన్ మూవీలా ఉందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఇది మేకర్స్ నుండి పెద్ద మిస్ కమ్యూనికేషన్ కారణంగానే జరిగిందని తెలుస్తోంది.ఇక ఆది పురుష్ చిత్రాన్ని మోషన్ పిక్చర్ టెక్నాలజీతో క్యాప్చర్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా తెలియజేయలేదు.


అప్పుడెప్పుడో మోషన్ క్యాప్చర్ వర్క్ స్టార్ట్ అయిందని దర్శకుడు  చెప్పాడు కానీ.. అది జనాలకు రీచ్ అయ్యేలా చేయలేకపోయారు.ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ తో యానిమేషన్ గా రూపొందించబడిన సినిమా అనే సందేశాన్ని మేకర్స్ స్పష్టంగా ప్రేక్షకులకు తెలియజేయకపోవడం.. ఈ సమాచారాన్ని అధికారికంగా అందించకపోవడమే ఈ గందరగోళాన్ని సృష్టించింది. టీజర్ లో వీఎఫ్ఎక్స్ మరియు సీజీ వర్క్ ఆశించిన స్థాయిలో లేదు. ఎక్కడ కూడా సహజత్వం లేకుండా.. ఒక కార్టూన్ మూవీ చూస్తున్నామనే అభిప్రాయాన్ని కలిగించేలా ఉన్నాయి. విజువల్ వండర్ ని అందిస్తారు అనుకుంటే.. టీవీలో ప్రసారమయ్యే సీరియల్ తరహా కంటెంట్ ను అందించారని డార్లింగ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముందుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టి.. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేసి ఆడియన్స్ ను ముందే ప్రిపేర్ చేసి ఉంటే.. ఇప్పుడు ఆది పురుష్ టీజర్ కు ఘోరమైన ట్రోలింగ్ ఉండేదని కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: