ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఏకంగా ఇండస్ట్రీని శాసించే హీరో స్థాయికి ఎదిగాడు మెగాస్టార్ చిరంజీవి. తన డాన్సులతో తన నటనతో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆర్టిస్టులు మెగాస్టార్ చిరంజీవిని కనీసం ఒక్కసారైనా సరే కలిస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. లేదా ఆయన సినిమాల్లో ఒక్క చిన్న పాత్ర వచ్చిన సరే ఇక అంతకంటే అదృష్టం ఇంకేమీ ఉండదు అని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ఇక మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చి రాణిస్తున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పాలి.


 ఇక చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ని చూస్తూ పెరిగి ఒక్కసారైనా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవాలనుకునే వారిలో అటు జబర్దస్త్ లో బాగా పాపులారిటీ సంపాదించిన గెటప్ శ్రీను కూడా ఒకరు అని చెప్పాలి. జబర్దస్త్ లో తనదైన స్టైల్ లో కామెడీ చేసి తన గెటప్లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఎలాంటి గెటప్ వేసిన కూడా అందులో ఒదిగిపోయినటిస్తూ ఉంటాడు గెటప్ శ్రీను. అందుకే అతనికి ఎన్నో సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అతన్ని పిలిచి అవకాశం ఇచ్చాడట.


 మెగాస్టార్ హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే సినిమాలో గెటప్ శ్రీను నటించిన ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి గెటప్ శ్రీనును ప్రత్యేకమైన విమానంలో  తీసుకువెళ్లారు. ఇలా ఒక చిన్న ఆర్టిస్టుని తన ప్రత్యేకమైన విమానంలో తన పక్కనే కూర్చోబెట్టి తీసుకువెళ్లడం అంటే చిరంజీవిది ఎంత గొప్ప మనసు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు గెటప్ శ్రీనుకి మరో బ్లాక్ బస్టర్ అవకాశాన్ని ఇచ్చారట. ఇకపోతే ఇక చిరంజీవితో విదేశాలకు వెళ్లి షూటింగ్లో పాల్గొనబోతున్నాడట గెటప్ శ్రీను. దీనికోసం జబర్దస్త్ కు బ్రేక్ వేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: