మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ నిన్న అనగా అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో చాలా గ్రాండ్ గా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన పాజిటివ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి.

ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ సినిమా విడుదల సమయంలో మెగాస్టార్ చిరంజీవి విరామం లేకుండా సినిమా ప్రమోషన్ లలో పాల్గొన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా ఇన్ని రోజుల పాటు గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్ లలో విరామం లేకుండా పాల్గొన్న చిరంజీవి ఇప్పుడు కొద్ది రోజుల పాటు ఎటైనా వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. తిరిగి వచ్చాక మూవీ షూటింగ్లలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి , మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో కీర్తి సురేష్ , చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ తో పాటు బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మరో మూవీ లో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు  ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: