హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ కెరియర్ ని ముందుకు సాగిస్తున్న హీరోలలో ఒకరు అయిన శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ విష్ణు ఇప్పటికే ఎన్నో మూవీ లలో ఎన్నో వైవిద్యమైన పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీ విష్ణు "అల్లూరి" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ విష్ణు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. కయదు లోహర్‌ ఈ మూవీ లో శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా నటించగా ,  ప్రదీప్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.  

బెక్కెం బబిత సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మించిన ఈ మూవీ (సెప్టెంబర్‌ 23) న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన అల్లూరి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ లో విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఈ రోజు నుండి "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

అసలు విషయం లోకి వెళితే ...  అల్లూరు మూవీ ఈ రోజు నుండి అనగా అక్టోబర్ 7 వ తేదీ రాత్రి 8 గంటల నుండి ప్రముఖ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: