అందాల ముద్దు గుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ niy సంపాదించుకుంది. ఉప్పెన మూవీ తో వెండి తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి ఆ తర్వాత అనేక మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఉప్పెన , శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీ లతో వరసగా హైట్రిక్ విజయాలను అందుకొని లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి ఆ తర్వాత ది వారియర్ ,  మాచర్ల నియోజకవర్గం , ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి మూడు అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా వరుసగా మూడు అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడంతో ఈ ముద్దు గుమ్మ కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కడం కష్టమే అని కొంత మంది భావించారు.

కాక పోతే కృతి శెట్టి కి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గనట్లు తెలుస్తుంది. వరుస సినిమా అవకాశాలు ఈ ముద్దు గుమ్మ కు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతి శెట్టి , నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తిరక్కబోయే మూవీ లో హీరోయిన్ గా కన్ఫామ్ అయ్యింది. ఇది వరకే నాగ చైతన్య , కృతి శెట్టి కాంబినేషన్ లో బంగార్రాజు మూవీ తెరకెక్కి బ్లాక్ బాస్టర్ కావడంతో , ఈ మూవీ పై సినీ ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ ముద్దు గుమ్మ చేతిలో మరో మూడు క్రేజీ సినిమా ఆఫర్ లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వరస అపజయాలు ఈ ముద్దు గుమ్మ ను పలకరించి నప్పటికీ కృతి శెట్టి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: