ఇండస్ట్రీలో చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లిచేసుకుంటారు.ఇలాంటివి సినిమా పరిశ్రమలో కామన్. ఇప్పటికే చాలా మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
కొందరు తమ ప్రేమను కాపాడుకుంటుంటే మరికొందరు తమలో తమకు ఏర్పడిన మనస్పర్దల కారణంగా విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో ఒకరి లవ్‌స్టోరీస్ బయటకు రావడంతో వైరల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లిచేసుకున్న వారిలో కేవలం నటీనటులే కాకుండా దర్శకనిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు.కొందరు తమ ప్రేమ గురించి ధైర్యం చేసి చెప్పి దానిని సాకారం చేసుకుంటే….
మరికొందరు ఆలస్యం చేయడం కారణంగా వారి ప్రేమ పెళ్లివరకు వెళ్లలేదు. ఇండస్ట్రీలో ఇలాంటి నటీనటులు చాలా మందే ఉన్నారు.అందులో హీరో గోపిచంద్ కూడా ఒకరు. గోపిచంద్ తన కెరీర్ ప్రారంభంలో హీరోగా ఎంట్రీ ఇచ్చినా అది హిట్ కాకపోవడంతో మరల జయం సినిమాలో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యజ్ఞం, రణం, లక్ష్యం, శంఖం,గోలిమార్ వంటి సినిమాలతో హీరోగా ఎదిగాడు. గోపిచంద్‌కు ఎక్కువ పేరు తీసుకొచ్చింది వర్షం సినిమా అనిచెప్పుకోవచ్చు.. ఇందులో విలన్ రోల్ ద్వారా మనోడికి హీరో రేంజ్ వచ్చింది.
గోపిచంద్ హీరోగా పరిచయం అవ్వడం కంటే ముందు సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర దర్శకుడు టి కృష్ణ కొడుకు. తొలివలపు చిత్రంతో గోపిచంద్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందలేదు. అయితే, ఈ సినిమాలో తనతో కలిసి నటించిన హీరోయిన్ స్నేహను గోపిచంద్ తొలిపరిచయంలోనే ప్రేమించాడట.. కానీ ఆ విషయం ఆమెకు చెప్పేందుకు ధైర్యం రాలేదట.. ఓ రోజు ధైర్యం చేసి ఈ విషయం తనకు చెప్పాలని భావించగా.. గోపిచంద్ తనకు అన్న లాంటి వాడని స్నేహ అక్కడ ఉన్న వారితో చెప్పడంతో తన ప్రేమ విషయం ఎప్పటికీ చెప్పలేదని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: