ధనుష్ నటిస్తున్న సినిమా లన్నీ డబ్బింగ్ అయ్యి తెలుగు లో కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. దీంతో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
ఈయన డైరెక్ట్ తెలుగు సినిమా తో రాబోతున్నాడు.. ప్రెసెంట్ ధనుష్ తెలుగు లో రెండు సినిమాలు చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించాడు. ఈ సినిమా పట్టా లెక్కక ముందే వెంకీ అట్లూరి దర్శకత్వం లో సినిమా స్టార్ట్ చేసాడు.. 'సార్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి చేసుకుంది.
బైలింగ్వన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక తాజా గా సార్ నుండి ఒక అదిరి పోయే అప్డేట్ బయటకు వచ్చింది.. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా మంచి బిజినెస్ జరిపినట్టు కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నారు.. ఓటిటి థియేట్రికల్ హక్కులు అన్ని కలిపి 90 కోట్ల బిజినెస్ జరిగినట్టు టాక్.. మరి ఇదే నిజం అయితే ధనుష్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇక తమిళ్ లో 'వాతి' పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే రెండు ఇండస్ట్రీ ల్లో మంచి అంచ నాలే ఏర్పడ్డాయి. చూడాలి ధనుష్ మొదటి తెలుగు సినిమా ఎంత విజయం అందు కుంటుందో..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి