కొంతమంది హీరోలకు ఉన్న మేనరిజమ్స్ వల్ల చాలా మంది ప్రేక్షకులు వారికి అభిమానులుగా మారిపోతూ ఉంటారు. ఆ విధంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ కు చాలా మంది ప్రేక్షకులు అభిమానులుగా మారిపోయారు. కేవలం ఆయన ఆటిట్యూడ్ వల్లనే ఆయనకు కోట్లాదిమంది అభిమానులుగా మారిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండకు అంతటి స్థాయిలో క్రేజ్ రావడంతో ఆయనకు కోట్లాదిమంది అభిమానులుగా మారిపోయారు అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో ఆయన సాధించిన విజయం అంతా కాదు. ఆ సినిమా తర్వాత అంతటి విజయాన్ని ఆయన అందుకోకపోయినా కూడా ఆ రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు.
అందుకే ఇప్పటికీ ఆయనకు అభిమానులు రోజురోజుకు ఎక్కువ అయిపోతున్నారని చెప్పాలి. తాజాగా లైగర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడడంతో ఇప్పుడు మరొక సినిమాతో ఆయన విజయం అందుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా ఆయన ఖుషి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. అయితే సినిమాలు వరుసగా నిరాశ పరుస్తున్న కూడా ఆయనకు యాడ్స్ రావడం ఏమాత్రం ఆగటం లేదు. ప్రపంచంలోని ఎన్నో టాప్ బ్రాండ్స్ ఆయనను తమ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది.
ప్రజలలో ఆయనకు ఉన్న ఆదరణకు క్రేజ్ కు నిదర్శనం ఇదే అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తెలుగులో ఇప్పుడు అత్యధిక యాడ్స్ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పాలి తొందర్లోనే ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఆయన ఖుషి సినిమాను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. శివనిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. సమంత కథానాయక నటిస్తూ ఉండగా ఫిబ్రవరి లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుపుకోబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి