బెంగుళూరు ఎయిర్ పోర్టులో తనకు జరిగిన అవమానాన్ని అనసూయ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. 'ఏలియన్స్ ఎయిర్' అనే ఎయిర్ లైన్స్ సంస్థ తనను, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన తీరు సోషల్ మీడియా వేదికగా ఎండగట్టిందట.


అనసూయ సందేశం ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అదే సమయంలో విషయం ఏదైనా ముక్కుసూటిగా వెళ్తారు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. తాజాగా బెంగుళూరు ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన అనుభవాలను అభిమానులకు తెలియజేసిందట.



కుటుంబంతో పాటు బెంగుళూరు వెళ్లిన అనసూయ తిరిగి హైదరాబాద్ రావడానికి 'Alliance Air' అనే ఎయిర్ లైన్స్ సంస్థలో టికెట్స్ బుక్ చేశారట.. ప్రయాణం చేయాల్సి రోజు ఈవెనింగ్ ఫ్లైట్ బయలుదేరడానికి ఒక గంట ముందే ఎయిర్ పోర్ట్ కి పిలిచారు. ఎయిర్ పోర్ట్ కి వచ్చాక వెయిట్ చేయించారు. తీరా ఫ్లైట్ వచ్చాక ఎయిర్ పోర్ట్ లోపలికి వెళుతుంటే మాస్క్ లేని కారణంగా అనుమతించలేదట. మాస్క్ లు ధరించాక లోపలికి పంపారు. ఇక విమానం లోపల పరిస్థితులు కూడా సరిగా లేవు.


ఫ్యామిలీ మెంబర్స్ కోసం వరుసగా సీట్స్ బుక్ చేస్తే… అలా కాకుండా వేరు వేరు ప్రదేశాల్లో కూర్చోబెట్టారు. అలాగే సీట్లు సరిగా లేవు. చిరిగిపోయి ఉన్నాయని దాంతో ఏదో పదునైన వస్తువుకు పట్టుకొని నా షర్ట్ చిరిగిపోయింది. మీ ఎయిర్ లైన్స్ సంస్థ సేవలు దారుణాతి దారుణం అంటూ.. అనసూయ తన ఆవేదన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారట. తన సందేశానికి సదరు ఎయిర్ లైన్స్ సంస్థను కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం అనసూయ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఈ రేంజ్ లో అనసూయ అసహనం వెళ్లగక్కిన నేపథ్యంలో ఆ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రతినిధులు స్పదింస్తారో లేదో మరి చూడాలి.


 


అనసూయకు జరిగిన ఈ అవమానం పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట.. మరోవైపు అనసూయ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల అమెరికా వెళ్లిన అనసూయ తానా(TANA) సభల్లో పాల్గొన్నారు. ఇక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ గాడ్ ఫాదర్ మూవీలో అనసూయ ఒక పాత్ర చేశారు. నటిగా వరుస ఆఫర్స్ వస్తుండగా యాంకరింగ్ పక్కన పెట్టారు. ప్రస్తుతం పుష్ప 2, రంగమార్తాండ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: