సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన చిత్రం డీజే టిల్లు.. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమా గా వచ్చి.. కలెక్షన్ల పరంగా భారీగానే సంపాదించింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ని కూడా మొదలు పెట్టేందుకు చిత్ర బృందం పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే డీజే టిల్లు-2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఈ రెండవ పార్టులో హీరోయిన్ గా అనుపమ నటించబోతోందని సమాచారం. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమంలో సిద్దు జొన్నలగడ్డ అనధికారికంగా ఈమె పేరును రివీల్ చేసినట్లు సమాచారం.


ఇక డీజే టిల్లు-2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నదని తెలియజేసినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీపావళి సందర్భంగా సర్ ప్రైజ్ వీడియోని ఇవ్వబోతున్నట్లు చిత్రబంధం అధికారికంగా ప్రకటించారు.డీజే టిల్లు-2 సినిమా షూటింగ్ అప్డేట్ మరియు ఇతర విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకత్వం ఎవరు వహిస్తారని విషయంలో కూడా స్పష్టత లేదు కాబట్టి రేపటి రోజున ఈ సినిమాపై అన్ని స్పష్టతలు వస్తాయని ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు.
మొదటి పార్ట్ కు ఏ మాత్రం తీసిపోకుండా రెండవ పార్టు ఉంటుందని నమ్మకాన్ని మాత్రం సిద్దు తెలియజేయడం జరుగుతోంది. సిద్దు ఈ సినిమాకి కూడా స్క్రిప్టు మరియు రచన అందిస్తున్నట్లుగా సమాచారం.డీజే టిల్లు-2 సర్ప్రైజ్ వీడియోలో ఈ సినిమా యొక్క విశేషాల తోపాటు సినిమా తేదీల పైన క్లారిటీ ఇవ్వాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. మరి దీపావళికి టపాసుల ఈ వీడియో పేలుతుందేమో చూడాలి. సీక్వెల్ తో వచ్చిన సినిమాలు అన్ని ఇప్పటివరకు మంచి విజయాన్ని అందుకున్నాయి. మరి డీజే టిల్లు-2 సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: