మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. చిరంజీవి ఈ సంవత్సరం మొదట ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించగా ,  తాజాగా గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు మూవీ లలో ఆచార్య మూవీ ప్రేక్షకులను నిరాశపరచగా , గాడ్ ఫాదర్ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి , బాబి దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తేరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ , చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ లో మాస్ మహారాజ రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. రవితేజ పాత్ర ఈ మూవీ కి హైలెట్ గ నిలబడి ఉన్నట్లు ,  ఈ మూవీ లో రవితేజ 40 నుండి 45 నిమిషాల నిడివి గల పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే వాల్తేరు వీరయ్య మూవీ నుండి టైటిల్ టీజర్ ను చిత్రం బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ టైటిల్ టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడం ,  మరియు ఈ టైటిల్ టీజర్ కు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించడంతో ప్రస్తుతం ఈ టైటిల్ టీజర్ కు యూట్యూబ్ లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో వాల్తేరు వీరయ్య మూవీ టైటిల్ టీజర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటివరకు యూట్యూబ్ లో వాల్తేరు వీరయ్య మూవీ 10 మిలియన్ వ్యూస్ ను , 305 కే లీక్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: