కాంట్రవర్సీ లేడీ, నటి పవిత్రా లోకేష్ ప్రస్తుతం  నరేష్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. నరేష్ తో లైఫ్ స్టార్ట్ చేశాక పవిత్రా లోకేష్ రూ.కోట్లల్లో ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. ఎందుకు? ఏంటనే విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. కన్నడ నటి పవిత్రా లోకేష్  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ కేరీర్ లో ఫుల్ బిజీగా ఉంది.  అమ్మ, అత్త, తదితర కీలక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 

ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్రా. అటు కన్నడతో పాటు ఇటు టాలీవుడ్ లో నూ వందకు పైగా చిత్రాల్లో నటించి పాపులారిటీని దక్కించుకుంది. ఇటీవల నటుడు నరేష్ తో లైఫ్ షేర్ చేసుకోవడంతో మరింతగా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యింది.

కొద్దిరోజుల కింద నరేష్ (Naresh) - పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) పెళ్లి మేటర్ తో నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఇంకా ఇష్యూ కొనసాగుతున్నప్పటికీ నరేష్ - పవిత్రా మాత్రం  కలిసే ఉంటున్నారు. సహజీవనం చేస్తూ కొత్త లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి బంధంపై రోజుకో కొత్త అంశం బయటికి వస్తోంది.
 

తాజాగా పవిత్రా లోకేష్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. నరేష్ తో సహజీవనం మొదలెట్టాక పవిత్రా రూ.కోట్లల్లో ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. ఎందుకని ఆరాదీస్తే.. తన బ్యూటీని మరింతగా పెంచుకునేందుకు ఇలా ఖర్చు చేస్తోందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే గ్లామర్ తో మతిపోగొట్టే పవిత్రా తన రూపసౌందర్యంపై ప్రస్తుతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందంట. ఇందుకోసం స్పెషల్ వర్కౌట్స్, డైట్స్, ఫేయిర్ నెస్ క్రీమ్, స్కిన్ గ్లో అయ్యే అన్ని ప్రాడక్ట్స్ ను వాడుతుందని అంటున్నారు. స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చే అందాన్ని, ఫిజిక్ ను సొంతం చేసుకునేందుకు రూ. లక్షల్లో ఖర్చు చేస్తుందంట. అలాగే ఈ వయస్సులోనూ డైట్ విషయంలో, వర్కౌట్స్ విషయం తగ్గేదేలే అంటుందని తెలుస్తోంది.

గతంలో పోల్చితే పవిత్రా కాస్తా నాజుగ్గానే తయారైంది. వెయిట్ లూస్ అవుతూ అట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ నటుడు, స్టార్ కమెడియన్ అలీ లీడ్ రోల్ లో నటించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’  చిత్రంలో  నరేష్ - పవిత్రా కూడా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: