టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత నాగార్జున హిందీ సినిమా బ్రహ్మాస్త్ర లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. బ్రహ్మాస్త్ర మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కి టాలీవుడ్  యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించగా , సోనాల్ చౌహన్మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన దసరా పండుగ సందర్భం గా థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ది ఘోస్ట్ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు నుండి అనగా నవంబర్ 2 వ తేదీ నుండి ప్రముఖ "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ది ఘోస్ట్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.  ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ఈ రోజు నుండి అనగా నవంబర్  2 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: