సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యాక ట్రోలింగ్ కల్చర్ చాలా విపరీతంగా పెరిగిపోయింది.ముఖ్యంగా హీరోయిన్లపై ట్రోల్స్ తో రెచ్చిపోతుంటారు నెటిజన్స్. గతంలో చాలా మంది హీరోయిన్లు వీటిపై రియాక్ట్ అయ్యారు. తాజాగా రష్మిక మందన్న ట్రోలింగ్ కల్చర్ పై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ట్రోలర్లపై ఆమె ఏకంగా ఒక లాంగ్ నోట్ రాసారు. ఓవైపు టాలీవుడ్ లో నటిస్తూ ఇంకా అలాగే మరోవైపు బాలీవుడ్ సినిమాలు చేస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా చాలా పాపులరైంది. కానీ ఇటీవల గుడ్ బై సినిమాతో ఆమెకు ఫ్లాప్ ఎదుర్కొంది. దాంతో తనపై ట్రోలింగ్ అమాంతం పెరిగింది. దీంతో  రష్మిక సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్ధేశించి ఒక పెద్ద నోట్ ను రాసింది. సోషల్ మీడియాలో ద్వేషాన్ని ఎదుర్కోవడం 'హృదయ విదారకం'.. ఇది తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని కోట్ చేసింది రష్మిక మందన. ఇంటర్నెట్ లో తప్పుడు ఆర్టికల్స్ వ్యాప్తి చెందుతున్నాయని ఇది తనకు  అలాగే ఇండస్ట్రీలో వున్నవారికి చాలా హానికరం అని ఎత్తి చూపారు.ఇన్ స్టాగ్రామ్ లో రష్మిక మందన ఇలా పేర్కొంది.


''గత కొన్ని రోజులు లేదా వారాలు నెలలు లేదా ఏళ్లుగా నన్ను కొన్ని విషయాలు చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. నేను దానిని పరిష్కరించే సమయం వచ్చిందని భావిస్తున్నాను. కేవలం నా కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా సంవత్సరాల క్రితం చేయవలసిన పని. నేను నా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి నేను చాలా ట్రోల్స్ కి గురవుతున్నాను. చాలా ట్రోలింగ్ ని ఎదుర్కొన్నాను. అలాంటి వాటికి నా సమాధానం ఇదే. నేను సెలెక్ట్ చేసుకున్న కెరీర్ రిస్క్ తో కూడుకున్నదని నాకు తెలుసు. నేను మీ అందరికి కప్పు టీని కాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రేమను పొందుతానని నేను అనుకోను. నన్ను ట్రోల్ చేయడం హృదయ విదారకం.. అది నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో నేను చెప్పని వాటి కోసం ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాను" అని రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: