
ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. స్వయంగా విజయ్ రంగంలోకి దిగి తన తమ్ముడు సినిమాలను ప్రమోట్ చేస్తున్నప్పటికీ ఆసినిమాలు విజయ్ వీరాభిమానులు కూడ పట్టించుకాకపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ఇక వైష్ణవ్ తేజ్ పరిస్థితి మరింత ఆశ్చర్యకరం. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బష్టర్ హిట్ తరువాత అతడికి సంబంధించిన సినిమాలకు కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడం షాకింగ్ గా మారింది.
వీరి ముగ్గురు పరిస్థితి ఇలా ఉంటే గతంలో రాజశేఖర్ టాప్ హీరోగా కొనసాగుతున్న రోజులలో అతడి తమ్ముడు సెల్వ ని ‘గ్యాంగ్ మాస్టర్’ గా పరిచయం చేసాడు ఆసినిమాను ఎవరు పట్టించుకోలేదు. ఇక శ్రీకాంత్ ఫ్యామిలీ సినిమాల హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో అతడి తమ్ముడు అనిల్ మేకాని తో సినిమాలు తీసినప్పటికీ అవి ఘోరమైన ఫ్లాప్ లుగా మారాయి. లేటెస్ట్ గా లేటెస్ట్ గా బెల్లంకొండ గణేష్ పరిస్థితి కూడ అలాగే ఉంది. దీనితో టాప్ హీరోల కొడుకులను చిన్నపాటి లోపాలు ఉన్నా తమ హీరోల వారసులుగా ప్రేక్షకులు అంగీకరిస్తున్నారు. కానీ అదే టాప్ హీరోల తమ్ముళ్ళను మాత్రం ఏమాత్రం అంగీకరించడం లేదా అన్న సందేహాలు వస్తున్నాయి.
అయితే దీనికి పూర్తి భిన్నంగా పవన్ కళ్యాణ్ కెరియర్ కనిపిస్తుంది. చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పవన్ కు చిరంజీవి స్థాయితో సమానంగా అభిమానులు ఉన్నారు. దీనితో ఒక హీరోగా సెటిల్ అవ్వడం అనేది సమర్థత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కాని కేవలం వారసత్వం పైన ఆధారపడి ఏ వారసుడు సక్సస్ కాలేదు అన్నవిషయం మరొకసారి రుజువు అవుతోంది..