ఫిదా బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు..తెలుగుతో పాటు పలు భాషల్లో నటించింది..ఈ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ ను అందుకుంది.అప్పటి నుంచి వరుస సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరింది.ప్రేమమ్ ఆ విజయం సాధించడానికి సాయి పల్లవి నటనకూడా కారణమనే చెప్పాలి అంతలా ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా అంటూ తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. భానుమతి సింగిల్ పీస్ అంటూ డైలాగ్ చెప్పిన ఈ భామ నిజంగానే సింగిల్ పీస్ గా గుర్తింపు తెచ్చుకుంది.


ఇక ఈ అమ్మడికి తెలుగులోనూ వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. మీడియం రేంజ్ హీరోలనుంచి స్టార్ హీరోల వరకు ఫస్ట్ ఛాన్స్ గా సాయి పల్లవి పేరే వినిపిస్తుంది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళ ల్లోనూ సాయి పల్లవి హీరోయిన్ గా నటించి మెప్పించింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ దూసుపోతోంది ఈ బ్యూటీ. అయితే గతకొంతకాలంగా సాయి పల్లవి నటిస్తున్న సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సాయి పల్లవి లాస్ట్ గా నటించిన సినిమా గార్గి..


లేడీ ఓరియెంటెడ్ మూవీగా వచ్చిన ఈ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే సాయి పల్లవి మెడిసిన్ చదివిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సాయి పల్లవి కోయంబత్తూర్ లో సొంతంగా ఓ హాస్పటల్ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఇక పై యాక్టింగ్ కు గుడ్ బై చెప్పి డాక్టర్ గా స్థిరపడాలని చూస్తుందట. ఈ హాస్పటల్ ను సాయి పల్లవితో పాటు ఆమె సిస్టర్ పూజా కలిసి నిర్వహించనున్నారట. అందుకనే ఈ బ్యూటీ సినిమాలకు బై బై చెప్పనున్నదని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: