తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు.

మూవీ పూర్తయిన వెంటనే దళపతి విజయ్ , లోకేష్ కనకరాజు దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇప్పటికే దళపతి విజయ్ 67 వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ కనకరాజు ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో దళపతి విజయ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నట్లు , దళపతి విజయ్ సరసన ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా కనిపించ బోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి  వెళితే ... ఈ మూవీ కి డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థ అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" సంస్థ 160 కోట్లకు కొనుగోలు చేసినట్లు అలాగే , ఈ మూవీ శాటిలైట్ హక్కులను  సన్ టీవీ సంస్థ 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో , మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే వీరిద్దరి కాంబినేషన్ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. లోకేష్ కనకరాజు తాజాగా విక్రమ్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో కమల్ హాసన్ హీరోగా నటించగా ,  విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించాడు. ఫాహాధ్ ఫాజిల్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ,  సూర్య ఈ మూవీ లో గెస్ట్ పాత్రలో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: