రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ మూవీ షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఇప్పటికి కూడా ఈ మూవీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇలా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా రోజులు జరగడానికి ప్రధాన కారణం ఈ మూవీ లో అత్యధికమైన వి ఎఫ్ ఎక్స్ పనులు ఉండడమే అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ మూవీ నుండి ప్రభాస్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను మరియు ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను అనుకున్నంత రేంజ్ లో అలరించ లేక పోయింది. ఈ మూవీ టీజర్ విడుదలలో భాగంగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బంధం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఆ తర్వాత ఈ మూవీ ని సంక్రాంతి కి విడుదలను వాయిదా వేశారు. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మూవీ ని వచ్చే సంవత్సరం విడుదల చేయడం కష్టమే అని ,  ఈ మూవీ  ప్రీ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున , ఈ మూవీ 2024 వ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: