దర్శకుడు హను రాఘవపూడి పేరు తెలియనివారు ఉండరు. ‘అందాల రాక్షసి’ మూవీ విడుదల తరువాత ఈదర్శకుడుకి ఎంతో పేరు వచ్చినప్పటికీ ఆతరువాత అతడు తీసిన ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ ‘పడిపడి లేచె మనసు’ చెప్పుకోతగ్గ విజయాలను అందుకోలేకపోవడంతో అతడు చెప్పే కథలను వినడానికి కూడ హీరోలు పెద్దగా ఆశక్తి చూపించలేదు అని అంటారు.
అయితే అతడు ఎంతో కష్టపడి తీసిన ‘సీతా రామం’ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో మళ్ళీ హీరోల మనసు మారి హను రాఘవపూడి వైపు మళ్ళుతోంది అంటూ వార్తలు వినిపించాయి. వాస్తవానికి జూనియర్ అదేవిధంగా రామ్ చరణ్ హను రాఘవపూడి తీయబోయే సినిమాలో నటిస్తారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆవార్తలు నిజం కాలేదు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. హను ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని తయారు చేసాడని అలాంటి లవ్ స్టోరీని  ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు తీయలేదు అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఈలవ్ స్టోరీలో పేరుమోసిన టాప్ హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ ఎవరు నటించడం లేదనీ అంతా కొత్త వారితో హను ఈ క్యూట్ లవ్ స్టోరీని తీయబోతున్నట్లు టాక్.
ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్న ఈమూవీ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి ప్రాంతంలో మొదలవుతుంది అంటున్నారు. ఇప్పటికే హను రాఘవపూడి నూతన నటీనటుల ఎంపిక సంబంధించి అనుసరించవలసిన ఒక యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నూతన నటీనటులతో సినిమా తీసి మెప్పిమ్చాలి అంటే చాలాచాల సాహసం చేయాలి. అయితే ఈ దర్శకుడు తీయబోతున్నది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ కాబట్టి ఎలాంటి ఇమేజ్ లేని కొత్త హీరో హీరోయిన్స్ అయితే తన సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడానికి మార్గం ఈజీగా ఉంటుందని హను ఇలాంటి ప్లాన్ లో ఉన్నాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: