మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటున్న ఈ షో ఆఖరి దశకు చేరుకుంది.. అయితే ఈ సీజన్ లో సింగర్ రేవంత్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా.. ఇక ప్రతివారం నామినేషన్ స్లో ఉన్న కూడా టాప్ ప్లేస్ లో ఉన్నాడు రేవంత్.. ఇదిలా ఉంటే ఇక రేవంత్ భార్య ఇటీవల పండంటి ఆడబిడ్డ కోజన్మ ఇచ్చింది.. ఇలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ రేవంత్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..

 ఇక అదేంటంటే సింగర్ రేవంత్ తండ్రి కావడం చేత ఈ వారం హౌస్ లో నుండి రేవంత్ ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు.. ఎందుకు అంటే రేవంత్ కి ఇది చాలా స్పెషల్.. ఈ సమయంలో రేవంత్ తన భార్య పక్కనే ఉండాలని తన భార్య బిడ్డలను చూసుకోవాలని బిగ్ బాస్ టీం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి...అయితే గత సీజన్లలో కూడా నటుడు అలీ రెజా తండ్రి ఆరోగ్యం బాగా లేకపోతే అతన్ని బయటికి పంపించి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలికి తీసుకువచ్చారు.. నటి ముమైత్ ఖాన్ విషయంలో కూడా ఇదే జరిగింది..

హౌస్ లో ఉన్నప్పుడు ఆమెకు ఈడి నోటీసులు వస్తే బిగ్ బాస్ యాజమాన్యం ఆమెని ఎలిమినేట్ చేసి మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఇంట్లోకి తీసుకువచ్చింది... అయితే ఇక రేవంత్ విషయంలో కూడా ఇదే జరుగుతుందేమో అని అందరూ అభిప్రాయపడుతున్నారు.. అయితే మరి కొంతమంది మాత్రం అలాంటి ఛాన్స్ లేదని ఎందుకు అంటే బిగ్ బాస్ మరో రెండు వారాలు మాత్రమే ఉంది కాబట్టి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండకపోవచ్చు అని అంటున్నారు.. ఇక రేవంత్ ని ఎలిమినేట్ చేసి మళ్లీ తీసుకొస్తారా లేదా అన్నది వీకెండ్ లో నాగార్జున చెప్పే వరకు ఆగాల్సిందే.. అంతేకాదు వీకెండ్ లో నాగార్జున రేవంత్ తండ్రి అయ్యాడు అనే విషయాన్ని ఏ విధంగా అతనికి చెప్తాడు అన్నది ఇప్పుడు సర్వర్త్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: