తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అయితే పరిచయమయ్యారు నటి నిధి అగర్వాల్.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో అయితే ఫలితాలను అందుకోలేకపోయింది.దీంతో ఈమె తన తదుపరి చిత్రాన్ని పూరి జగన్నాథ్ రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించారు.

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈమెకు తమిళంలో పలు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

ఇక తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయమైనప్పటికీ తన తదుపరి తెలుగు సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ సినిమా విజయం కాస్త పూరి జగన్నాథ్ రామ్ ఖాతాలోకి చేరిపోయిందని తెలుస్తుంది.. ఇకపోతే తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర మీరు మల్లు సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో కూడా స్పష్టత కూడా లేని విధంగా ఉంది. ఇకపోతే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని కెరియర్లో ముందుకు రాణించడం కోసం నిధి అగర్వాల్ పెద్ద ఎత్తున త్యాగాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తమిళంలో ఈమె స్టార్ హీరోలైనటువంటి శింబు మరియు ఉదయనిది స్టాలిన్ వంటి హీరోల సరసన నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు.దీంతో ఈమె తన కెరీర్లో అవకాశాలను అందుకొని మంచిగా నిలదొక్కుకోవడం కోసం దర్శక నిర్మాతలకు భారీ ఆఫర్లు ఇస్తుంది.ఇకపోతే స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం కనుక వస్తే తనకు రెమ్యూనరేషన్ కూడా అవసరం లేదంటూ ఇదివరకు పలు ఇంటర్వ్యూలలో చెప్పినటువంటి ఈమె తాజాగా మరోసారి ఇదే విషయాన్ని కూడా వెల్లడించారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ధనుష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే మన అమ్మడి చూపు ధనుష్ పై పడిందని చెప్పాలి. ఇలా ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలలో కేవలం ఆయన పక్కన నటించే అవకాశం వస్తే చాలని తనకు ఎలాంటి రెమ్యూనరేషన్ అవసరం లేదని తేల్చి చెప్పారు. మరి నిధి అగర్వాల్ ఇలాంటి అవకాశం ఇచ్చినప్పటికీ దర్శక నిర్మాతలు ఈమె ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ధనుష్ సినిమాలో అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలియాలి మరి..

ఇలా ఒక వైపు సినిమా అవకాశాలను అందుకోవడం కోసం రెమ్యూనరేషన్ కూడా త్యాగం చేస్తుండడంతో సినిమాల పట్ల ఈమెకు ఉన్నటువంటి డేడికేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా మంచి సినిమా అవకాశాలను అందుకోవడం కోసం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ తెగ రచ్చ చేస్తున్నారు. ఇలా సినిమాల కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి నిధి అగర్వాల్ కష్టానికి గుర్తింపు లభిస్తుందో లేదో మరి వేచి చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: