వివాదాలతో సాహసం చేసే సినిమా నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు బండ్ల గణేష్. ఎప్పుడు ఏదో ఒక వార్తతో.. వార్తల్లో నిలుస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం .అయితే తాజాగా అల్లు ఫ్యామిలి మీద ఆయన చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. అయితే ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్న సినీ నిర్మాత బండ్ల గణేష్ అల్లు.. బాబి తో కలిసి ఫోటోలు దిగడం జరిగింది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ అందరికీ చెప్తున్నా తండ్రి మాట వినొద్దు తండ్రిని గౌరవించి ఆయన మాట వింటే

 మా బాబిలా అవుతారు తండ్రి మాట వినకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తే అల్లు అర్జున్ లాగా ఉంటారు.. బాబిలా కావాలా బన్నీ లాగా కావాలా అనేది మీరే నిర్ణయించుకోండి అంటూ చెప్పడం జరిగింది. అయితే బాబి చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదువుకొని మామూలుగా ఉన్నాడు.. అసలే వినకుండా ఉన్న బన్నీ ఇండియా సూపర్ స్టార్ హీరో అయ్యాడు. దయచేసి తండ్రి మాట ఎవరు వినొద్దు సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టండి  అని చెప్పాడు బండ్ల గణేష్ .అయితే ఈ మాటలను పాజిటివ్ గా తీసుకున్న బాబి నవ్వాడు.

 దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది. అంతేకాకుండా ఇది చూసిన కొందరు  గణేష్ పై విమర్శలు చేయడం కూడా జరుగుతుంది. దీనికిగాను పబ్లిక్ లో ఏది పడితే అది మాట్లాడడమే నా ఎందుకంత నోటి దురుసు ఒకరిని కించపరిచేలా మాట్లాడడం కరెక్టా.. ఇలాంటివి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అని నెటిజన్లో కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దీంతోపాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఏకంగా మా బన్నీ తండ్రి మాట వినలేదని నీకు ఏమైనా వచ్చి చెప్పాడా నోటికి వచ్చినట్లు ఎందుకు వాగుతున్నావ్ అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: