మాస్ మహారాజా ప్రస్తుతం వరస మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం రవితేజ రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం మొదట రవితేజ "ఖిలాడి" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం అందుకోలేదు. ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో రవితేజ హీరో గా నటించాడు. శరత్ మండవ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రాజేశ విజయన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే రెండు మూవీ లతో ప్రేక్షకులను నిరాశపరిచిన రవితేజ ఈ సంవత్సరం మూడవ మూవీ తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సంవత్సరం రవితేజ "ధమాకా" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో తనకెక్కిన ఈ మూవీ లో శ్రీ లీల రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజాగా ధమాకా మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక అప్డేట్ ను విడుదల చేసింది. ఈ మూవీ నుండి రేపు హై వోల్టేజ్ మాస్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ధమాకా మూవీ యూనిట్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: