నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని ఇప్పటికే అనేక అద్భుతమైన విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే నాని ఈ సంవత్సరం అంటే సుందరానికి మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "హిట్ ది సెకండ్ కేస్" మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లో నాని అతి తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపించినప్పటికీ ఈ పాత్రతో నాని ప్రేక్షకులను బాగానే అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మూవీ లో కీర్తి సురేష్ , నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ లో పూర్ణ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో నాని ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలలో నాని ఊర మాస్ లుక్ లో కనిపించాడు. ఇది ఇలా ఉంటే నాని మరి కొన్ని రోజుల్లోనే యూరప్ హాలిడే ట్రిప్ కు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. యూరప్ హాలిడే ట్రిప్ ముగించుకొని నాని వచ్చిన తర్వాత దసరా మూవీ క్లైమాక్స్ ను మూవీ యూనిట్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే దసరా మూవీ ని పన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ ,  మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: