బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ నటించిన సాహూ సినిమా గురించి భారత సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి.  బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ విడుదల కావడంతో ఇక ఈ సినిమాలో ప్రభాస్ ని కొత్తగా చూడబోతున్నాం అని అభిమానులు భారీగానే అంచనాలు  పెట్టుకున్నారు.


 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులందరూ కూడా ఇక కళ్ళు కాయలు కాసేలా సాహో సినిమా కోసం ఎదురుచూశారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సాహో సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయ్. కానీ రిలీజ్ అయ్యాక మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. ఫస్ట్ డే మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ పూర్తిగా స్ప్రెడ్ కావడంతో ఎంతోమంది సినిమాకు వెళ్లడాన్నే మానుకున్నారు. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ ఇచ్చిన అవకాశాన్ని సుజిత్ వినియోగించుకోలేకపోయాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు.


 350 కోట్లతో తెరకెక్కి ఫ్లాప్ టాప్ తెచ్చుకున్న ఈ సినిమా ఇక ఓవరాల్ గా మాత్రం 450 కోట్లు రాబట్టి నిర్మాతలకు లాభాలని మిగిల్చింది. ఇకపోతే ఇప్పుడు సాహో విడుదలైన మూడేళ్ల తర్వాత ఈ సినిమా హిట్ టాక్ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అయితే సాహో సినిమాకి కల్ట్  క్లాసిక అంటూ స్టేటస్ ఇస్తున్న వారిలో ఎక్కువ మంది మెగా అభిమానులు ఉన్నారు. సాహో డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. ఇక ఇక ఈ అఫీషియల్ ప్రకటన బయటికి వచ్చినప్పటి నుంచి కూడా సాహో సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అంటూ పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు పవన్ ఫ్యాన్స్. అంతకుమించి సుజిత్ పవన్ సినిమాకు స్వయంగా ప్రభాస్ స్పందించి అభినందించడంతో ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: