కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  కేవలం తమిళ్ చిత్రాలనే కాదు తమిళ్లో తెరకెక్కించిన సినిమాలను తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదల చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అజిత్ నుంచి సినిమా వస్తోంది అంటే కేవలం తమిళ్ ప్రేక్షకులే కాదు ఇతర భాషా అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తారు.  ఈ క్రమంలోనే ఇదే ఏడాది వలిమై చిత్రంతో వచ్చిన అజిత్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్,  కన్నడ, హిందీ , మలయాళం భాషలలో విడుదల చేసి మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తునివు సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 11వ తేదీన సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కాబోతోంది.  తెలుగులో తెగింపు పేరుతో విడుదల కాబోతున్న ఈ సినిమా కథ  దర్శకుడు హెచ్ వినోద్ లీక్ చేయడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.. ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా హెచ్ వినోద్ మీడియాతో మాట్లాడుతూ.." తునివు సినిమా పంజాబ్లో జరిగిన బ్యాంకు దోపిడీ ఆధారంగా తీసింది కాదు.. నిజాయితీ లేని లోకం నేపథ్యంలో సాగే చిత్రం ఇది.. ఈ సినిమాలో ఓ సముద్రంలో అద్భుతమైన చేజింగ్ సీన్ ఉంది.. ఇది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది." అంటూ దర్శకుడు హెచ్ వినోద్ స్పష్టం చేశారు.


అయితే ఈ సినిమాపై హైప్ పెంచడానికి ఆయన ఈ సినిమాలోని కొంచెం కథను లీక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో తెగింపు పేరుతో విడుదల చేయడానికి రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ , IVY ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమా హక్కులను రూ.3కోట్లకు కొనుగోలు చేశారు. సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్న ఈ సినిమా రూ.6 కోట్లు కలెక్ట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: