దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించి ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని , భారీ వసూళ్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ ద్వారా రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి మూవీ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కూడా భారీ బడ్జెట్ తో అత్యంత భారీ ఎత్తున తేరకెక్కించడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాక ముందే ఈ మూవీ పై అనేక రూమర్ లు పుట్టుకొస్తున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు తండ్రి గా అమితా బచ్చన్ నటించ బోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించబోతుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అలియా భట్ , రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: